గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. మంగళవారం ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్అండ్బి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న రోడ్డు, నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.