బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు లంచ్ సమయానికి న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. ఈ మేరకు కివీస్ మొదటి ఇన్నింగ్స్లో 299 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీ చేశారు. 124 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 100 రన్స్ పూర్తి చేసుకున్నారు. టిమ్ సౌథీ(49*) క్రీజులో ఉన్నారు.