త్రిపురారం మండలం మాటూరు గ్రామానికి చెందిన భారత దివ్యాంగ క్రికెట్ జట్టు క్రీడాకారుడు డి. వస్త్రం నాయక్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల జట్లతో జరిగిన క్రికెట్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఇటీవల నేపాల్ లో నిర్వహించిన ఇండియా-నేపాల్ టీ20 క్రికెట్ పోటీల్లోనూ మూడు మ్యాచులు ఆడి, జట్టు విజయానికి కృషి చేశారు. చంచల్ గూడ జైలు సూపరిండెంటెంట్ నవాబు శివకుమార్ గౌడ్ ఘనంగా సత్కరించారు.