ఈ వానాకాలం ధాన్యం కొనుగోలులో భాగంగా ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యంతో పాటు, 4900 క్వింటాళ్ల సన్న ధాన్యం సైతం కొనుగోలు చేశామని , ధాన్యం అమ్మిన రైతులకు ఇప్పటి వరకు 109 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేసినట్లు ఆమె వెల్లడించారు.