రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని వ్యవసాయ విస్తరణ అధికారి అబ్దుల్ సత్తార్ అన్నారు. నల్లగొండ పట్టణంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. దొడ్డు ధాన్యానికి రూ 2320, సన్నాళ్లకు బోనస్ తో కలిపి రూ 2820 అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు ధాన్యాన్ని ఆరబెట్టుకుని రావాలని సూచించారు.