నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త పరిశోధకుడు డాక్టర్ మోదాల మల్లేష్ జువాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లైఫ్ నెంబర్ గా ఎంపికయ్యారు. జంతు శాస్త్రం పరిశోధనలలో ఆయన చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. డాక్టర్ మల్లేష్ పత్తి పంటలపై కీటకాల వైవిధ్యం పై పరిశోధన చేసినందుకుగాను కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ పట్టా గురువారం పొందారు.