ప్రతి ఫౌండేషన్ ద్వారా అనేకమంది విద్యార్థులకు చేయూతన అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ పెద్ద సూరారం గ్రామ వాసి డాక్టర్ ఏడుదొడ్ల సూర్య ప్రకాష్ రెడ్డి- డాక్టర్ మౌనికల సహకారంతో ఆగ్రామానికి చెందిన బీటెక్ ద్వితీయ సంవత్సరం చదివే పేద విద్యార్థి ముసుకు సుమన్ కు నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా ల్యాప్ టాప్ ను అందజేశారు.