తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టు ఖండిస్తున్నాం: సైదులు

1594பார்த்தது
తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్టు ఖండిస్తున్నాం: సైదులు
లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేస్తారని భయంతో రాష్ట్ర సర్కారు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తుందని నకిరేకల్ భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బుడిగే సైదులు అన్నారు. తీన్ మార్ మల్లన్న అనే ఒక జర్నలిస్టును అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు వాళ్ళు సెల్ఫోన్లో కేటీఆర్ బొమ్మలు ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఉన్నారా లేరా అనే సందేహం ప్రజలలో వస్తుంది. ఒక నికాస్ అయిన జర్నలిస్టును అరెస్టు చేసేటప్పుడు పోలీసు ఫార్మాలిటీస్లను పాటించలేదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రజాకార్ల రాజ్యంలో ఏం చేసినారో ఆ విధంగా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భారత రాజ్యాంగ ప్రకారం పోలీసులు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చినాక రాకుంటే అప్పుడు అరెస్టు చేసే రైట్స్ ఉంటాయి అని వివరించారు. మరి విడ్డూరంగా కాకుంటే. పోలీసులు మఫ్టీలో రావడం ఏంటంని ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ నకిరేకల్ మండల ప్రధాన కార్యదర్శిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி