కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నార్కట్ పల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతుధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ షరతులు లేకుండా హామీలు, కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని నిరసన చేపట్టడం జరిగిందన్నారు. రైతన్నలపై చిన్నచూపు తగదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ చిరుమర్తి మండిపడ్డారు.