నకిరేకల్ డిగ్రీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్స్

77பார்த்தது
నకిరేకల్ డిగ్రీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్స్
ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీలో చేరేందుకు ఉన్నత విద్యామండలి సెప్టెంబర్ 9న స్పాట్ అడ్మిషన్స్ ను కల్పించిందని నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. బెల్లి యాదయ్య అన్నారు. కాన్వాసింగ్ లో భాగంగా చుట్టుప్రక్కల గ్రామాలను సందర్శించి ఇంటర్ పాసైన విద్యార్థులు స్థానిక ప్రభుత్వ కళాశాలలో B. A, B. Com, B. Sc కోర్సుల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி