రేపు నల్గొండలో జాబ్ మేళా

64பார்த்தது
రేపు నల్గొండలో జాబ్ మేళా
నల్గొండ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎస్. మాధవరెడ్డి తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ చదివిన 18 ఏళ్ల వయసు నుంచి 35 ఏళ్ల లోపు స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని అన్నారు. రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி