కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ చౌకధరల దుకాణం వద్ద లబ్ధిదారులకు అయన సన్న బియ్యం పంపిణీ చేశారు.