సోమవారం భారతీయ జనతా పార్టీ నకిరేకల్ మండలం శాఖ ఆధ్వర్యంలో మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి మండల వెంకన్న వచ్చినారు. పార్టీ బూతు స్థాయి సమావేశాల గురించి దిశా నిర్దేశం ఇవ్వడం జరిగినది. కార్యక్రమంలో మండల అధ్యక్షులు యానాల శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సాయన్న, ప్రధాన కార్యదర్శిలు బుడిగే సైదులు, రాములు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు సీత ఆంజనేయులు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు శ్రీకాంత్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు తీర్పాల మల్లేష్, బూత్ అధ్యక్షులు చనగాని సైదులు తదితరులు పాల్గొన్నారు.