త్రిపురారం: నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేత

60பார்த்தது
త్రిపురారం: నూతన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందజేత
డీఎస్సీ _2024 ద్వారా నియామకం అయి త్రిపురారం మండలానికి కేటాయించబడ్డ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి రమావత్ రవినాయక్ నియామకం ఉత్తర్వులను బుధవారం అందజేసి అభినందనలు తెలిపారు. పాఠశాల విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. పాఠశాలకు వచ్చే విద్యార్దులకు ఉత్తమ విద్య అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி