రీజనల్ రింగ్ రోడ్డు వల్ల భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు, భువనగిరి నియోజకవర్గంలోని రాయగిరి ప్రజలు, గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిను హైదరాబాదులోని తన నివాసంలో కలిశారు. ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని ప్రభుత్వంతో మాట్లాడి అలైన్మెంట్ మార్పించాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహారమైన చెల్లించాలని కోరారు.