అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి అందించే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన గాదేపాక సురేష్ కు అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా ఉండేందుకు ఎమ్మెల్యే మంజూరైన 54 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారునికి అందజేశారు.