అందరూ నిత్యం యోగ, ఆసనాలు చేయడం ద్వారా ఒత్తడులకు దూరమై సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని యోగ ప్రధాన గురూజీ చిదళ్ల వెంకటేశ్వర్లు కోరారు. గురువారం స్థానిక మేరెడ్డి రామచంద్ర రెడ్డి గ్రంథాలయంలో యోగ గురూజీ ఐన ఆయన 60వ జన్మదిన వేడుకల్లో పాల్గొని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ఒత్తడి కాలంలో రెండు గంటలు యోగకు కేటాయిస్తే అయస్సు పెంచుకోవచ్చని, ఆనందాన్ని పొందవచ్చని సూచించారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ యోగా చేసి ఆరోగ్యాన్ని పొందాలని కోరారు.