నల్గొండ: పెండింగ్ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు

52பார்த்தது
నల్గొండ: పెండింగ్ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు
పెండింగ్ ఉన్న దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 83 మంది వినతిపత్రాలు సమర్పించారని, వ్యక్తిగత అంశాలు, పింఛన్లు, భూమికి సంబంధించిన అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆమె సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி