నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. నాగవంశీ నిర్మాతగా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్-ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సహ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాకి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడిగే ఉద్దేశం లేదని తేల్చి చెప్పాడు.