ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో బాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్ ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. దీన్ని తమ ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మినీటీవీలో విలీనం చేసి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ గా తీసుకొచ్చినట్లు వెల్లడించింది. కాగా, ఎంతకు కొనుగోలు చేసిందో మాత్రం కంపనీ తెలుపలేదు.