TG: హైదరాబాద్ బండ్లగూడకు చెందిన సనా బేగం అలియాస్ సనా టైగర్, తన ముగ్గురు కొడుకులు మహమ్మద్, సాహిల్, సోహైల్‌తో కలిసి చోరీలకు పాల్పడుతోంది. ధనికుల ఇండ్లనే టార్గెట్ చేసి వాళ్లు లేని సమయంలో చోరీలు చేస్తున్నారు. అయితే ముందు ఆమె వెళ్లి మొత్తం పరిశీలించి స్కెచ్ వేయగా.. తన కుమారులు ఇండ్లలోకి ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన ఎన్‌ఆర్ఐ ఇంట్లో దోపిడి చేయగా.. అసలు విషయం బయట పడింది.