ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్ నియామకం

75பார்த்தது
ఫ్రాన్స్ నూతన ప్రధానిగా మిషెల్ బార్నియర్ నియామకం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆ దేశ నూతన ప్రధానిగా మిచెల్ బార్నియర్ ను గురువారం నియమించారు. ఎన్నికలు ముగిసి హంగ్ పార్లమెంటు ఏర్పడిన రెండు నెలల తర్వాత ఈ నియామకం చేపట్టారు. యూరోపియన్ యూనియన్ బ్రెగ్జిట్ సంధానకర్తగా పనిచేసిన బార్నియర్, ఈయూ కమిషనర్ గానూ పనిచేశారు. ప్రధానమంత్రి పదవికి సరైన అభ్యర్థి కోసం ఇటీవల అధ్యక్షుడు మెక్రాన్ పలువురు నేతల పేర్లు పరిశీలించినప్పటికీ వారిలో ఎవ్వరికీ అవసరమైన మద్దతు లభించలేదు.

தொடர்புடைய செய்தி