ఐపిఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ మరో పేసర్ ను కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ ప్లేయర్ దీపక్ చాహర్ ను వేలంలో రూ.9.25 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు ముకేశ్ కుమార్ ను రైట్ టు మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అతడిని పంజాబ్ వేలంలో కొనుగోలు చేయగా DC రూ.8 కోట్లు ఆ ఫ్రాంచైజీకి చెల్లించి ముకేశ్ ను తీసుకుంది.