TG: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో సెక్రటేరియట్‌లో భేటీ అయ్యారు. ఇప్పటికే NSUI విద్యార్థి సంఘాల నేతలతో చర్చించిన మీనాక్షి నటరాజన్.. రెండో సారి మంత్రుల కమిటీతో సమావేశమయ్యారు. కాగా త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మీనాక్షి చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఈ భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.