పటాన్ చెరు: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ. 20. 60 లక్షలు స్వాహా

64பார்த்தது
పటాన్ చెరు: ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ. 20. 60 లక్షలు స్వాహా
పటాన్ చెరు పరిధిలోని ఓ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగికి సెప్టెంబర్ 23 ఆన్ లైన్ ట్రేడింగ్ కు సంబంధించి ఓ మెసేజ్ వచ్చింది. దీంతో అతడు ఆన్లైన్లో పెట్టుబడి పెడుతూ వచ్చాడు. పలు దఫాలుగా మొత్తం రూ. 20. 60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పెట్టిన పెట్టుబడి, వచ్చిన లాభం ఇవ్వాలని అడగ్గా సదరు వ్యక్తి నుంచి స్పందన లేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

தொடர்புடைய செய்தி