నారాయణఖేడ్: కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఆర్డీఓ
రైతులు దళారులకు ధాన్యం అమ్మవద్దని, కొనుగోలు కేంద్రంలో అమ్మాలని డీఆర్డీఓ జ్యోతి అన్నారు. బుధవారం నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లి, ర్యాకల్ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం జయశ్రీ, ఏపీఎం వంశీకృష్ణ, సీసీలు రాజు, అశోక్ గౌడ్, ఎఈవో శ్రీనివాస్, వివోఎ సుల్తాన్ బి, నాగమణి, శ్రీషేల పాల్గొన్నారు.