సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం శనివారం రాత్రి నిర్వహించారు. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు గంటపాటు భక్తులు హనుమాన్ చాలీసాను భక్తిశ్రద్ధలతో చదివారు. హనుమంతునికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వాహకులు జరిపించారు. స్వామి వారికి మహా నైవేద్యం, హారతి సమర్పించారు.