రైతులు దళారులకు ధాన్యం అమ్మవద్దని, కొనుగోలు కేంద్రంలో అమ్మాలని డీఆర్డీఓ జ్యోతి అన్నారు. బుధవారం నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్కపల్లి, ర్యాకల్ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం జయశ్రీ, ఏపీఎం వంశీకృష్ణ, సీసీలు రాజు, అశోక్ గౌడ్, ఎఈవో శ్రీనివాస్, వివోఎ సుల్తాన్ బి, నాగమణి, శ్రీషేల పాల్గొన్నారు.