సమగ్ర కుల గణన సర్వే గడువు పెంచాలని కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు జోగిపేటలో మంగళవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు మణయ్య మాట్లాడుతూ.. గడువు తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులపై వేధింపులు ఆపాలని కోరారు. గడువు పెంచేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు పాల్గొన్నారు.