కల్హేర్ మండల కేంద్రానికి చెందిన అల్లం అశోక్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 18, 000 రూపాయల చెక్కును బుధవారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి స్వగృహంలో బాధితులకు అందజేయడం జరిగింది. వారితోపాటు మండల తాజా మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ సంగప్ప, తాజా మాజీ ఉపసర్పంచ్ సాయిలు, చంద్రయ్య, శంకర్ తదితరులు ఉన్నారు.