మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట సంతోష్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న తోట మహేందర్, ఓ మహిళ, విటుడు బోలెం శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.