మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాం నగర్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏడీఈ వేణుగోపాల్, ఏఈ కె. శ్రావణ్ కుమార్ తెలిపారు. 33/11 కేవీ సబ్ స్టేషన్ లో పాత 8. 0 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్త 12. 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ ఫార్మర్ పునరుద్ధరణ చేస్తున్నందున నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.