క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ ప్రభాకర్ తెలిపారు. నాలుగు వరసల రహదారి పనుల కారణంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మున్సిపల్ పరిధిలోని గద్దెరాగడి, క్యాతనపల్లిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఆయా ప్రాంతాల వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.