యువత, మహిళల మద్దతు ఉంటేనే రాజకీయ పార్టీలకు మనుగడ

81பார்த்தது
యువత, మహిళల మద్దతు ఉంటేనే రాజకీయ పార్టీలకు మనుగడ
యువత, మహిళల మద్దతు లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో జరిగిన యువగళం సదస్సులో ఆయన మాట్లాడారు. యువకులు, మహిళలు ఓటు వేసి ఆదరిస్తేనే పదవి దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி