నస్పూర్ మున్సిపాలిటీ పరిధి సీతారాంపల్లిలోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రగతిలో రైతుల పాత్ర కీలకం అన్నారు. రైతులకు ఉపయోగపడే పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ భూమి, కౌలు, అనువంశిక వారసత్వాలకు సంబంధించిన చట్టాల గురించి వివరించారు. సమస్యలు ఎదురైతే తమ సంస్థను సంప్రదించాలని సూచించారు.