మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లపేటకు చెందిన ఓరుగంటి సతీష్ (25) టాటా ఏసీ వాహనం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 11న ఇంట్లో నుంచి వెళ్లిపోయి మంగళవారం వరకు కూడా ఇంటికి రాలేదు. సతీష్ భార్య రమ్య తన భర్తకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందన్నారు. బంధువులు స్నేహితుల ఇళ్లలో వెతికిన ఆచూకి లభించలేదు. రమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాములు తెలిపారు.