తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యత నమోదు కార్యక్రమం ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్, టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ హాజరై జర్నలిస్టులకు సభ్యత్వ రసీదులను అందజేశారు. జర్నలిస్టుల హక్కుల సాధనకు సంఘం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని అల్లం నారాయణ స్పష్టం చేశారు.