అభివృద్ది పనులకు బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య యాదవ్ బుధవారం ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పనిచేస్తున్నారని తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు వెడల్పు చేస్తే ప్రజలకు ట్రాపిక్ సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు.