మంచిర్యాలలో విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఎంఈఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థిని మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు జుమ్మిడి గోపాల్, బచ్చలి ప్రవీణ్ కుమార్, రేగుల క్రాంతి కుమార్, ఎస్కే సల్మాన్ పాషా పాల్గొన్నారు.