మంచిర్యాలలోని అశోక్ రోడ్డులో మహమ్మద్ మోహిన్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందినట్లు పట్టణ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి ఇంట్లోని బాత్రూంలో విద్యుత్ బల్బు పనిచేయకపోవడంతో హోల్డర్ ను సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సరికే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.