మంచిర్యాల జోన్ లోని ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను పోలీస్ అధికారులతో కలిసి మంచిర్యాల డీసీపీ భాస్కర్ మంగళవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంచిర్యాల జోన్ వ్యాప్తంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి 58 పోలింగ్ కేంద్రాలు, 21 లొకేషన్స్, 58 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు.