జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో రైతుల పొలాల్లో మోటారు వైర్ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిలో ఒకరిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీసీ నస్పూర్ కు చెందిన మోటం తిరుపతి, ఏవేల అంజి ఉదయం ఉల్లిగడ్డల వ్యాపారం పేరుతో గ్రామాల్లో తిరుగుతూ రెక్కీ చేసి పొలాల్లో ఉన్న వైర్లను గమనించి రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ మేరకు మోటం తిరుపతిని అరెస్టు చేసి 20 కిలోల కాపరు వైరు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.