జన్నారం మండలంలో నాటుసార గుడుంబా తయారు చేయడం, విక్రయించడం చేస్తున్న పలువురిపై కేసు నమోదు చేసి తాసిల్దార్ వద్ద గురువారం బైండోవర్ చేసినట్లు ఆబ్కారి శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహులు తెలిపారు. తిరిగి ఇలాంటి నేరాలకు పాల్పడితే రూ. లక్ష, జరిమానా లేదా సంవత్సరం జైలు శిక్ష విధిస్తామని ఆయన పేర్కొన్నారు.