కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అపార్ కార్డు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంచిర్యాల డి ఈ ఓ యాదయ్య తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఒకే నెంబర్లో విద్యార్థికి సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేస్తారని పేర్కొన్నారు. దీనికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు