సేవ, సోదర భావానికి ప్రతిగా బక్రీద్ పర్వదినమని మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య అన్నారు. సోమవారం మంచిర్యాల 9వ వార్డు ఆండలమ్మ కాలనీ ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ వేడుకలను సోదర భావంతో ప్రశాంతంగా జరుపుకోవాలని చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ తదితరులు పాల్గొన్నారు.