సింగరేణి స్కూల్ డే సంబరాలు

577பார்த்தது
సింగరేణి స్కూల్ డే సంబరాలు
మందమర్రిలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో గురువారం సింగరేణి స్కూల్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్, మందమరి ఏరియా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల పిల్లల విద్యాభివృద్ధికి యాజమాన్యం సహాయంగా ఉంటుందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయిలోకి ఎదగాలని తల్లిదండ్రులకు , స్కూల్ కు ప్రాంతానికి మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి మరింతగా కష్టపడాలన్నారు. చక్కటి విద్యా బోధన అందించి వారిని మంచి మార్గంలో నడిపించాలి అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి, అలాగే గత సంవత్సరం పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఆటల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం కృష్ణారావు , హెచ్ ఓ డి పర్సనల్ శ్యాంసుందర్, సింగరేణి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుందర్ రావు, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி