రామకృష్ణాపూర్ పట్టణంలోని ఐఎన్ టియుసి కార్యాలయంలో శనివారం మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మిక వర్గానికి కాకా వెంకటస్వామి ఎన్నో సేవలు అందించారని తెలిపారు.