మందమర్రి జిఎం కార్యాలయ ఆవరణలో పతాకాన్ని ఏరియా ఇన్చార్జి జిఎం విజయ్ ప్రసాద్ ఆవిష్కరించి గురువారం బొగ్గు నాణ్యత వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం అధికారులు, కార్యాలయ సిబ్బందితో బొగ్గు నాణ్యత పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన బొగ్గుతోనే సింగరేణికి మనగడ సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిఎం కార్యాలయ అధికారులు, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.