జైపూర్ మండలంలోని ఇందారం గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులకు అధికారులు రెయిన్ కోట్లను అందజేశారు. పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీపతి బాబు, కార్యదర్శి సుమన్ వీటిని పంపిణీ చేశారు. ఎడతెరిపి లేని వర్షాలతో కార్మికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కార్యదర్శి తెలిపారు. దోమలు, ఈగలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను ఆయన కోరారు.