చెన్నూరు మండలంలోని శనగకుంట చెరువు మత్తడిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఇటీవల మందు పాత్రలు పెట్టి శనగకుంట చెరువు మత్తడి పేల్చివేతకు గురైన విషయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి పరిశీలించారు. ఈ విషయం పై జైపూర్ ఏసిపి, చెన్నూరు సిఐ లను కలిసి చర్చించారు. నాయకులు మాట్లాడుతూ చెరువు మత్తడి కూల్చివేతలో వెనుక ఉన్న వారిని బయటకు తీసి చట్టపరమైన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.